మహారాష్ట్రలో అత్యధికంగా 175 మరణాలు

మహారాష్ట్రలో అత్యధికంగా 175 మరణాలు
X

కరోనా సంక్రమణ కారణంగా దేశంలో మరణించిన వారి సంఖ్య 15,689 కు పెరిగింది. గత 24 గంటల్లో 16 రాష్ట్రాల్లో 381 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 175 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 7,106 కు చేరింది. మరోవైపు, తమిళనాడులో మరణించిన వారి సంఖ్య వెయ్యికి దగ్గరగా ఉంది. శుక్రవారం ఇక్కడ 46 మంది రోగులు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 957 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 63 మంది మరణించారు.

దీంతో ఇక్కడ మరణాల సంఖ్య 2,492 కు చేరుకుంది. ఇక కొత్తగా గుజరాత్ కంటే ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ మరణాలు సంభవించాయి. గుజరాత్‌లో 18 మంది మరణించగా, ఉత్తరప్రదేశ్‌లో 19 మంది మరణించారు. ఇవే కాకుండా, హర్యానాలో 13, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 10, తెలంగాణలో 7, మధ్యప్రదేశ్లో 4, పంజాబ్లో 2, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్ లో 1 మరణం సంభవించింది.

Tags

Next Story