ఆవనూనె, నిమ్మరసం వాడి సిలిగురి పోలీసులు వైరస్ ని..

కరోనా మహమ్మారి దరి చేరకుండా ఉండాలంటే ఏ చిట్కా అయినా పాటించడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. తాజాగా పశ్చిమ బెంగాల్ పోలీసులు వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆవాల నూనె, నిమ్మరసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని సిలిగురి పోలీస్ కమిషనరేట్ లోని సీనియర్ పోలీస్ అధికారులు ఈ ప్రయోగం చేసి విజయం సాధించినట్లు చెబుతున్నారు. సిలిగురి పోలీస్ అధికారులు విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఉడికించిన మెత్తని బంగాళదుంపలను ఆవనూనెతో కూర వండి అన్నంలో కలుపుకుని తినాలి.
ఆవనూనెలో ఇయర్ బడ్స్ ముంచి రోజుకి మూడు సార్లు ముక్కు రంద్రాల్లో వేసుకోవాలి.
ఆవ నూనెను నాలుగు ఐదు చుక్కలు గోరు వెచ్చని నీళ్లలో వేసి రోజుకు నాలుగు ఐదు సార్లు ఆవిరి పట్టాలి.
గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసి రోజుకు నాలుగు సార్లు తాగాలి.
వేడి నీటిలో ఉప్పు వేసి నాలుగు సార్లు పుక్కిలించాలి.
దీంతో పాటు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలి.
ఆవనూనె జలుబు, దగ్గును నయం చేసేందుకు ఉపయోగపడుతుందని, అందువల్ల దీన్ని పాటిస్తున్నామని సిలిగురి పోలీసులు చెబుతున్నారు. ఇటీవల డీసీపీ బంధువు, ఒక పోలీస్ కానిస్టేబుల్, అతని భార్య కరోనా బారిన పడి ఆవ నూనె, నిమ్మరసం వాడి కోలుకున్నారని సిలిగురి పోలీస్ కమిషనర్ త్రిపురారీ ఆర్గవ్ చెప్పారు. రోగ నిరోధక శక్తి పెంచడంలో ఈ గృహవైద్యం సమర్థవంతంగా పని చేస్తుందని కమిషనర్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com