రెడ్ లైట్ ఏరియాల్లో కరోనా మహమ్మారి..!!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇక రెడ్ లైట్ ఏరియాల్లో కరోనా మహమ్మారి మరింతగా ప్రబలే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసన్ , హార్వార్డ్ మెడికల్ స్కూల్ విద్యావేత్తలు జరిపిన అధ్యయనంలో.. రెడ్ లైట్ ప్రాంతాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. ఇండియాలోని వ్యభిచార ప్రాంతాల్లో 4 లక్షలకు మందికి పైగా కరోనా సోకే ప్రమాదం ఉన్నట్లు యేల్ యూనివర్శిటీ కి చెందిన నిపుణులు పేర్కొన్నారు.
అయితే వ్యభిచారం జరిగే ప్రాంతాలను పూర్తిగా బంద్ చేస్తే.. కరోనా సమస్యను కొంత మేర తగ్గించవచ్చని సర్వేలో తేలింది. ఒకవేళ వ్యభిచార గృహాలు తెరిస్తే ఊహించని రీతులో కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు.. ఈ ఏరియాల్లో కరోనా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. ఈ విపత్కర పరిస్థితిల్లో రెడ్ లైట్ ఏరియాలను పూర్తిగా మూసి వేయడం ద్వారా .. కరోనా కేసులు , మరణాలను దేశంలో 60 శాతానికి కు పైగా తగ్గించే అవకాశాలున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com