తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌కు ఢోకా లేదు - మంత్రి హరీష్‌

తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌కు ఢోకా లేదు - మంత్రి హరీష్‌

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో ఏపీఆర్‌ సంస్థ వారి నూతన ఏపీఆర్‌ ప్రవీణ్స్‌ గ్రాండియో వెంచర్‌ బ్రోచర్‌ను విడుదల చేశారు మంత్రి హరీష్‌రావు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి. బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఏపీఆర్‌ సంస్థ ఎండీ ఆవుల కృష్ణారెడ్డి, డైరెక్టర్‌ సంజీవరెడ్డి పాల్గొన్నారు.

కరోనా ఉన్నా.. నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు రావడం సంతోషంగా ఉందని తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌కు డోకా లేదన్నారు మంత్రి హరీష్‌రావు. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమవుతే.. ఆర్ధిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. మిగిలిన నగరాల కంటే హైదరాబాద్లో రియల్‌ ఎస్టేల్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు హరీష్‌.

Tags

Read MoreRead Less
Next Story