ఆరో విడత హరితహారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

ఆరో విడత హరితహారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో ఆసరా పెన్షన్లు, రైతుబంధు అమలవుతోందని, రూ. 25వేల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఆరో విడత హరితహారంలో భాగంగా ఆవునూరు-వెంకటాపూర్ మానేరు ఒడ్డున మొక్కలు నాటి మెగా ప్లాంటేషన్ కు శ్రీకారం చుట్టారు. హరితహారం పండుగ వాతావరణంలో జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 46వేల చెరువులు, కుంటలు నిండాలని, వ్యవసాయంలో హరిత విప్లవం రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు. ఇంత సంక్షోభంలో కూడా పేదలకోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడా ఆగలేదన్నారు మంత్రి కేటీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story