జైలులో ముంబై పేలుళ్ల దోషి మృతి

జైలులో ముంబై పేలుళ్ల దోషి మృతి
X

అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమన్ సోదరుడు యూసుఫ్ మెమన్ శుక్రవారం నాసిక్ సెంట్రల్ జైలులో మరణించాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతను హార్ట్ అటాక్ తో అతను మరణించినట్టు తెలుస్తోంది. ముంబై పేలుళ్ల మాస్టర్‌ మైండ్, ప్రస్తుతం పరారీలో ఉన్న‌ టైగర్‌ మెమన్‌కు యూసఫ్‌ సోదరుడనే సంగతి తెలిసిందే.

కాగా, స్పెషల్‌ టాడా కోర్టు ఈ కేసులో యూసఫ్‌కు జీవిత ఖైదు విధించింది..1993 మార్చి 12న ముంబై బాంబు పేలుడు కేసులో యూసుఫ్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. టైగర్ మెమన్ సోదరులు యూసుఫ్ మెమన్ , ఇసా మెమన్ 1993 వరుస బాంబు పేలుడు కుట్ర చేయడానికి తమ ఫ్లాట్లను ఇచ్చారు.. ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 250 మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు.

Tags

Next Story