రాష్ట్రానికి కంపెనీ తీసుకురావడం అంటే పంచాయతీ భవనాలకు రంగులు వేయడం కాదు : లోకేశ్

X
ఏపీలో జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురావడం అంటే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నంత ఈజీ కాదంటూ ట్వీట్ చేశారు. రికార్డు టైంలో కంపెనీలు ఏర్పాటు కావాలన్న, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలన్న అది ఒక చంద్రబాబునాయుడికే సాధ్యమన్నారు లోకేష్.
టీడీపీ హయంలో కంపెనీ ఏర్పాటుకి ముందు వచ్చి తొలిదశలో 3 వేల 800 కోట్లు పెట్టుబడి పెట్టి.. ఈ రోజు తొలి టైర్‌ను విడుదల చేసిన అపోలో టైర్ సంస్థను అభినందిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ మరింత వృద్ధి చెంది ఆంధ్రరాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
