భగ్గుమంటున్న పెట్రో మంట.. 21 రోజూ పెరిగిన ధరలు

భగ్గుమంటున్న పెట్రో మంట.. 21 రోజూ పెరిగిన ధరలు
X

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. వరుసగా 21 వ రోజూ చమురు ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.38, లీటర్ డీజిల్‌ ధర రూ.80.40కి చేరింది. దీంతో 21 రోజుల్లో డీజిల్‌పై మొత్తం రూ.10.27, పెట్రోల్‌పై రూ.9.18 పైసలు పెరిగాయి.

లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్‌ 7 నుంచి దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్‌ 1న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.71.26గా ఉండగా, ప్రస్తుతం అది రూ.80.33కి చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.80.40కి చేరింది. దీంతో పెట్రోలు రేట్ కంటే డీజిల్ ధర ఎక్కువగా నమోదైంది.

మోదీ ప్రభుత్వం రాక ముందు 2014 మే 13 నాటికి దేశంలో లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయల 51 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ ధర 57 రూపాయల 28 పైసలుగా ఉంది. అప్పట్లో పెట్రోల్‌, డీజిల్ రేట్లకు మధ్య 14 రూపాయల తేడా ఉండేది. అప్పుడే కాదు, గతంలోనూ పెట్రోల్ రేట్ కంటే డీజిల్ ధరే తక్కువగా ఉండేది. కానీ రాను రాను పరిస్థితి మారిపోయింది. డీజీల్ ధర పెట్రోల్‌ ధరతో సమానమయ్యింది. ఇప్పుడేమే ఏకంగా పెట్రోల్ రేట్ కంటే డీజిల్ రేటే ఎక్కువగా ఉంది.

Tags

Next Story