భర్త వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

భర్త వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

భర్త వేధింపుల కారణంగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్‌ చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. రాళ్లగూడకు చెందిన లావణ్యకు ఎనిమిదేళ్ల క్రితం వెంకటేష్‌ అనే జెట్‌ ఎయిర్‌ వేస్‌ పైలట్‌తో పెళ్లైంది. అయితే పిల్లలు పుట్టకపోవడంతో వెంకటేష్‌.. తరచూ భార్యను వేధించేవాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన లావణ్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన చావుకు భర్త వెంకటేషే కారణమంటూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో.. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని పేర్కొంది. తనకు ఎంతో ప్రేమను పంచిన తల్లిదండ్రులను మోసం చేసి వెళుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై మీద ప్రేమ ఉందని అందుకే సూసైడ్‌ చేసుకుంటున్నట్లు తెలిపారు.

లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేష్‌ తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు ఆమె తండ్రి ఈశ్వరయ్య. ఎనిమిదేళ్లుగా తన కూతురిని అల్లుడు చిత్రహింసలకు గురి చేశాడని తెలిపాడు. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడన్నారు. ఈ సూసైడ్‌పై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story