గుర్గావ్‌లో మిడతల దండు.. శ్రమిస్తున్న రైతులు

గుర్గావ్‌లో మిడతల దండు.. శ్రమిస్తున్న రైతులు
X

వేలెడంత కూడా లేని మిడతలు వివిధ దేశాల్లోని లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. కోట్లమంది ఆహార భద్రతకు పెనుముప్పు కలిగిస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చిన మిడతల దండు వివిధ రాష్ట్రాల్లో పంటలను నమిలేస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో మిడతల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. భారీ మిడతల సమూహం ఇప్పుడు హర్యానా రాష్ట్రం గుర్గావ్ చేరుకుంది. పలు ప్రాంతాల్లో శనివారం ఆకాశం కప్పబడినట్టుగా మిడుత సమూహాలు కనిపించాయి. మారుమూల ప్రాంతంలోని పంటలను కవర్ చేశాయి.

వివిధ ప్రాంతాలలో ఎత్తైన నివాసాల మీద వేలాది మిడతలు ఆవహించి ఉన్నాయి. గుర్గావ్‌లో నిత్యం రద్దీగా ఉండే ఎంజి రోడ్ , ఇఫ్కో చౌక్ ప్రాంతాల్లో మిడతలు తిరుగుతున్నాయి. దీంతో రోడ్లమీద తిరిగేందుకు జనం అయిష్టత ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైనా పచ్చగా కనిపిస్తే చాలు క్షణాల్లో అక్కడ వాలి చెట్లను బోడు చేస్తున్నాయి. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు.

Tags

Next Story