దంపతుల చేతిలో సీఎస్, డీజీపీ పగ్గాలు..

దంపతుల చేతిలో సీఎస్, డీజీపీ పగ్గాలు..
X

పంజాబ్ రాష్ట్రం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విని మ‌హాజ‌న్ నియమితులయ్యారు. కరణ్ అవతార్ సింగ్ స్థానంలో శుక్రవారం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు, 1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి విని మహాజన్ పంజాబ్ చరిత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి నియమితులైన మొదటి మహిళా బ్యూరోక్రాట్ గా రికార్డు సృష్టించారు.

అంతేకాదు విని మహాజన్ రాష్ట్ర డిజిపి దింకర్ గుప్తా సతీమనే.. దీంతో పంజాబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని సివిల్ మరియు పోలీసు పరిపాలనలు ఐఎఎస్-ఐపిఎస్ దంపతుల నేతృత్వంలో ఉన్నట్టయింది. గ‌త వారం రోజుల నుంచి విని మ‌హాజ‌న్ నియామ‌కంపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి.. అయితే రెండు రోజుల క్రిత‌మే ఆమెను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Tags

Next Story