హైదరబాద్‌లోని అమీర్‌పేట ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక హైదరబాద్ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. Ghmc పరిధిలో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజు రోజుకీ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య బారీగా పెరుగుతోంది. తాజాగా అమీర్ పేట ఎమ్మార్వో చంద్రకళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.
ముందస్తు జాగ్రత్తగా.. ఎమ్మార్వోతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులు కలిసి మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక మిగతా ముగ్గురికి నెగిటివ్ వచ్చినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. ఏసీబీ కేసులో షేక్ పేట తహసీల్దార్ సుజాత అరెస్టు అయ్యారు. దీంతో షేక్ పేట ఇంచార్జి ఎమ్మార్వోగా చంద్రకళ విధులు నిర్వర్తిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com