24 గంటల్లో 19,906 కొత్త కేసులు, 414 మంది మృతి

24 గంటల్లో 19,906 కొత్త కేసులు, 414 మంది మృతి
X

దేశమంతటా కరోనా మహమ్మారి శాంతించడం లేదు. గత 24 గంటల్లో 19,906 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,859కు చేరింది. మరోవైపు కరోనా సంక్రమణ కారణంగా దేశంలో మరణించిన వారి సంఖ్య 16,103 కు పెరిగింది. శనివారం 16 రాష్ట్రాల్లో 414 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 68 మంది రోగులు మరణించారు. దీంతో అక్కడ వెయ్యి మందికి పైగా మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 167 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 7,273 కు చేరింది.

మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో 66 మంది రోగులు మరణించారు. దీంతో ఇక్కడ మరణాల సంఖ్య 2,558 కు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో 19 మంది, గుజరాత్‌లో 18 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్‌లో 13, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 11, హర్యానాలో 7, మధ్యప్రదేశ్‌లో 4, తెలంగాణ, పంజాబ్, బీహార్, జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరేసి రోగులు మరణించారు.

Tags

Next Story