coronavirus : ఆ రాష్ట్రంలో రికవరీ రేటు 62.11 శాతం..

coronavirus : ఆ రాష్ట్రంలో రికవరీ రేటు 62.11 శాతం..
X

హర్యానాలో కరోనా రోగుల సంఖ్య 13007 కు పెరిగింది. శనివారం కొత్తగా 123 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా ఒక రోగి మరణించారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 212 మంది రోగులు మరణించారు. శనివారం రాష్ట్రంలో 62 మంది రోగులు కోలుకోవడంతో ఇప్పటివరకు 8078 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4717 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలో 68 మంది రోగులు పరిస్థితి విషమంగా ఉంది. 53 మంది రోగులు ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతున్నారు, 15 మందిని వెంటిలేటర్లపై ఉంచారు.

శనివారం, గుర్గావ్ లో 65 మందికి కరోనా ఉన్నట్టు తేలింది. దాంతో ఇక్కడ మొత్తం రోగుల సంఖ్య 5009కి చేరుకుంది. కొత్తగా రోహ్‌తక్‌లో 20, పానిపట్‌లో 14, నుహ్‌లో 10, జజ్జర్‌లో 8, పంచకులాలో 3, యమునానగర్‌లో ముగ్గురు పాజిటివ్ రోగులు ఉన్నారు. అయితే రోహ్‌తక్‌లో 57 మంది, నుహ్‌లో 4, జాజ్జర్‌లో 1 మందిని డిశ్చార్జ్ చేశారు. ఇక ఇప్పటివరకు 2,44,534 నమూనాలను పరీక్ష కోసం పంపగా, అందులో 2,25,931 నివేదికలు ప్రతికూలంగా రాగా, 13007 నివేదికలు పాజిటివ్‌ వచ్చాయి. వీరిలో 8844 మంది పురుషులు, 4161 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఇక రికవరీ రేటు 62.11 శాతానికి చేరుకుంది.

Tags

Next Story