జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి భూప్రకంపనలు

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి భూప్రకంపనలు
X

జమ్మూ కాశ్మీర్‌లో శనివారం మధ్యాహ్నం 12.32 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. s సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ ప్రకారం, దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4 గా ఉంది. దీని కేంద్రం రాష్ట్రంలోని ఈశాన్య భాగంలోని హాన్లే నుండి 332 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతకుముందు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో, కాశ్మీర్ లోయలోని కిష్త్వార్ , దోడా జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి. దాని తీవ్రత 4.5 గా ఉంది.

అయితే ఈ ప్రకంపనలలో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా జమ్మూ కాశ్మీర్‌లో జూన్ 14, 15 తేదీల్లో కూడా ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇదిలావుంటే గత కొద్దిరోజులకిందట ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌లలో ప్రకంపనలు వచ్చాయి.

Tags

Next Story