మాలావి నూతన అధ్యక్షుడిగా లాజరస్ చక్వేరా

ఇటీవల మాలావి దేశంలో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. మాలావి నూతన అధ్యక్షుడిగా లాజరస్ చక్వేరా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
ఆయనకు 58.57 శాతం ఓట్లు వచ్చాయని, దీంతో పీటర్ ముతారికాను ఓడించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇకనుంచి ఐదేళ్ల కాలానికి 18 మిలియన్ల జనాభా కలిగిన మాలావి దేశ అధ్యక్షుడిగా చక్వేరా ఉంటారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
నిజానికి 2014 నుండి అధికారంలో ఉన్న ముతారికను గతంలో 38.57 శాతం ఓట్లతో గత ఏడాది విజేతగా ప్రకటించారు, ఆ ఎన్నికల్లో చక్వేరాకు 35.41 శాతం ఓట్లు వస్తే.. మాజీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిల్లిమాకు 20.24 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఆ ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని , , ఫలితాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నికలు పెట్టేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తిరిగి ఎన్నికలు నిర్వహించేలా కోర్టు ఆదేశించడంతో ఈసారి 58.57 శాతం ఓట్లతో లాజరస్ చక్వేరా విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com