ఐ లవ్‌ న్యూయార్క్‌ సృషికర్త ఇకలేరు..

ఐ లవ్‌ న్యూయార్క్‌ సృషికర్త ఇకలేరు..
X

ఐ లవ్‌ న్యూయార్క్‌ సృషికర్త మిల్డన్ గ్లేజర్ కన్నుముశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గుండెపోటుతోపాటు మూత్రపిండం వైఫల్యంతో గ్లేజర్‌ బాధపడుతున్నట్టు ఆయన భార్య షిర్లీ గ్లేజర్‌ తెలిపారు.

1929వ సంవత్సరంలో బ్రోంక్ల్సో లో జన్మించిన గ్లేజర్.. గ్రాఫిక్ డిజైనర్‌గా ఎంతో ప్రసిద్ధి పొందారు. ఇక ఐ లవ్‌ న్యూయార్క్‌ లోగోను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు గ్లేజర్‌. పోస్టర్లు, లోగోలు, ప్రకటనలు, పుస్తకాల కవర్లన్నీ గ్లేజర్ ఆలోచనల నుంచి తయారైన ఐ లవ్‌ న్యూయార్క్‌ అనే లోగోతో నిండిపోయి కనిపించేవి. ఇప్పటికీ ఈ లోగోకు ఎంతో ప్రచుర్యం ఉంది. ఈ లోగో రూపకల్పన తర్వాత ఎన్నో దేశాలు తమ ఉత్పత్తుల ప్రాచుర్యం కోసం ఇలాంటి లోగోల రూపకల్పన చేసుకున్నాయి.

Tags

Next Story