హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌లో శనివారం కుండపోత వర్షం కురిసింది. రుతుపవనాలకు తోడు ఉపరితలద్రోణి ప్రభావంతో గ్రేటర్‌వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. శనివారం సాయంత్రం వాతావరణం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి 10 గంటల వరకు నాంపల్లిలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైట్లు తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ వెల్లడించింది. ఈ వర్షాకాలంలో ఇదే రికార్డు. రానున్న మూడ్రోజులు గ్రేటర్‌వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి మరాఠ్వాడా వరకు విదర్భ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఆది, సోమవారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది.

Tags

Next Story