దేశ భద్రతను రాజకీయం చేయకండి : శరద్ పవార్

దేశ భద్రత, సరిహద్దు వివాదాలపై కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ దీనిపై స్పందించారు. దేశ భద్రత, సరిహద్దు వివాదాలను రాజకీయం చేయవద్దని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ సూచించారు. 1962 భారత్- చైనా యుద్ధం అనంతరం 45,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఇది ఎప్పటికి మరచిపోలేమని శరద్ పవర్ అన్నారు.
పెట్రోలింగ్ సమయంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారని, లడఖ్‌లో గాల్వన్ లోయ సంఘటనను రక్షణ మంత్రి వైఫల్యమని వెంటనే అనకూడదని తెలిపారు. దేశ భద్రత అంశాల్లో రాజకీయాలు తగదన్నారు. జూన్ 15 రాత్రి తూర్పు లడఖ్‌లో భారత్ చైనా సైకుల మధ్య జరిగిన హింసాత్మకంగా ఘటనలో ఇరవై మంది భారత్ సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com