15 రోజులు బేగం బజార్ బంద్.. పాతబస్తీ క్లోజ్

15 రోజులు బేగం బజార్ బంద్.. పాతబస్తీ క్లోజ్

ఏం చేస్తే కరోనా వైరస్ కనిపించకుండా పోతుందో అర్థం కావట్లేదు అధికారులకి. మాస్కులు, శానిటైజర్లు ఓకే కానీ సామాజిక దూరం పాటించడం అంటే కొంతకష్టమే. కరోనా భయపెడతున్నా బయటకి రాక తప్పట్లేదు.. ఎవరికి ఉందో ఎవరికీ లేదో తెలియట్లేదు.. మొత్తానికి కంటికి కనిపించకుండా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న మహమ్మారి వ్యాప్తిని కొంచెమైనా కట్టడి చేద్దామని హైదరాబాద్ పాతబస్తీ వాసులు స్వచ్ఛందంగా దుకాణాలు 15 రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్క హైదరాబాదులోనే 774 కేసులు రావడం వారిని మరింత భయాందోళనకు గురిచేసింది. దీంతో పాతబస్తీలోని కొందరు వ్యాపారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా 15 రోజులు బంద్ పాటిస్తున్నారు. అలాగే ఆదివారం నుంచి జూలై 5 వరకు బేగంబజార్ మూసివేస్తున్నట్లు అక్కడి వ్యాపారులు ప్రకటించారు.

Tags

Next Story