10 రోజులు డ్యూటీ.. 10 రోజులు రెస్ట్: సర్కార్ నిర్ణయం

10 రోజులు డ్యూటీ.. 10 రోజులు రెస్ట్: సర్కార్ నిర్ణయం
X

కొవిడ్ రోగులకు సేవలందిస్తూ వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. దీన్ని నివారించేందుకు కేరళ ప్రభుత్వం త్రీ టైర్ పూల్ విధానాన్ని తీసుకు రానుంది. ఈ కొత్త నిర్ఱయం ప్రకారం మూడు రకాలుగా సిబ్బందిని విడగొడతారు. అవి కొవిడ్ పూల్, ఆఫ్ డ్యూటీ పూల్, రొటీన్ పూల్. ఈ విభాగంలో 10 రోజులు పని చేసి 10 రోజులు సెలవు తీసుకుంటారు. వీరు రోజుకు మూడు షిప్టుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఎనిమిది గంటల షిప్టులో నాలుగు గంటలు పర్సనల్ ప్రొటెక్షన్ పీపీఈ కిట్ ధరించి, మరో 4 గంటలు పీపీఈ కిట్ లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్ష చేసుకోవాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం 'ఎమర్జెన్సీ రిలీవర్స్ టీమ్' ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇందులో 15 మంది సిబ్బంది ఉంటారు. డ్యూటీ ముగిసిన తరువాత హెల్త్ కేర్ వర్కర్లు ఆస్పత్రిలోనే స్నానం చేసి వెళ్లాలి.

Tags

Next Story