మాతృభాష హిందీ అయినా 8 లక్షల మంది ఆ సబ్జెక్ట్ లోనే ఫెయిల్

మాతృభాష హిందీ అయినా 8 లక్షల మంది ఆ సబ్జెక్ట్ లోనే ఫెయిల్
X

హిందీని మాతృభాషగా కలిగిన ఉత్తరప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్ అయ్యారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27న యూపీలో టెన్త్, ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 7.97 లక్షల మంది హిందీ సబ్జెట్ లో ఫెయిల్ అయినట్టు అధికారులు తెలిపారు. హిందీని పట్టుగొమ్మగా భావించే రాష్ట్రంలో ఇంత మొత్తంలో హిందీ సబ్జెట్ లో ఫెయిల్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ విద్యార్థులు 2.70 లక్షల మంది కాగా.. టెన్త్ విద్యార్థులు 5.28 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. అయితే, ఇదే అంశం గురించి మాట్లాడని ఓ హిందీ టీచర్.. పిల్లలకి భాషపై పట్టులేకపోవడమే ఇలాంటి ఫలితాలకు కారణమని అన్నారు. ఆత్మవిశ్వాస్ అనే పదానికి కూడా అర్థం తెలియని విద్యార్థులు చాలా మంది ఉన్నారని.. పరీక్షా పేపర్లు కరెక్షన్ చేసినపుడు ఇలాంటి విషయాలు తాను గ్రహించానని ఆమె తెలిపారు. అయితే, హిందీ వలన భవిష్యత్ లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవనే బావనలో ఈ భాషపై ఏగాగ్రత చూపించడం లేదని అన్నారు. కాగా, గత ఏడాది కూడా 10 లక్షల మంది హిందీలో ఫెయిల్ అయ్యారు.

Tags

Next Story