అంతర్జాతీయం

నౌక‌ను ఢీ కొట్టిన పడవ.. 23 మంది మృతి

నౌక‌ను ఢీ కొట్టిన పడవ.. 23 మంది మృతి
X

బ‌ంగ్లాదేశ్‌లోని బురిగంగా న‌దిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మార్నింగ్ బ‌ర్డ్ అనే ప‌డ‌వ‌.. మున్షిగంజ్ నుంచి స‌ద‌ర్ ఘాట్ వైపు వెళ్తున్న స‌మ‌యంలో మౌయురి-2 అనే నౌక‌ను ఢీకొట్టింది. దీంతో ప‌డ‌వ నీటిలో మునిగింది. ఈ ఘటనలో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తున్న 23 మంది మృతి చెందారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో మొత్తం 50 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది సహాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు.

Next Story

RELATED STORIES