పెళ్లిపీటలపైనే వధువు మృతి..

పెళ్లిపీటలపైనే వధువు మృతి..
X

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ పెళ్లిలో విషాదం చోటు చేసుకుంది. కొద్దిసేపట్లో పెళ్లితంతు ముగుస్తుందనే లోపు.. పెళ్లిపీటలపైనే వధువు కుప్పకూలింది. కాళ్ల పారాణి ఇంకా ఆరక ముందే పెళ్లి కుతూరు మృత్యు ఒడిలోకి చేరింది. కనౌజ్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంట తడి పెట్టించింది.

థాథియా పోలీస్‌ సర్కిల్‌లోని భగత్‌పూర్వ గ్రామంలో వధువు ఇంట్లో శుక్రవారం రాత్రి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరుడు సంజయ్‌.. తన కుటుంబ సమేతంగా వధువు వనిత ఇంటికి చేరుకున్నాడు. కాగా, పెళ్లితంతు జరుగుతుండగా.. వనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కి తరలించారు.

అయితే కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా వస్తేనే జాయిన్‌ చేసుకుంటామని డాక్టర్లు తేల్చిచెప్పారు. ఇక చేసేదేం లేక ఆమెను కుటుంబ సభ్యులు కాన్పూర్‌కు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story