కరోనా ఎఫెక్ట్.. మూతపడ్డ ముఖ్యమంత్రి కార్యాలయం

పుదుచ్చేరిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పుదుచ్చేరిలో ఇప్పటివరకు 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పుదుచ్చేరి సీఎం కార్యాలయ ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. దీంతో రెండు రోజులు పాటు సీఎం కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
సీఎం కార్యాలయ ఉద్యోగికి శనివారం పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో.. రెండ్రోజులు సీఎం కార్యలయం మూసివేసి క్రిమినాశిని మందులను పిచికారీ చేస్తున్నారు. సదరు ఉద్యోగి సీఎంను పలుమార్లు వెళ్లి కలిసినట్లు సమచారం. ఈ నేపథ్యంలో సీఎం వి. నారాయణస్వామితో పాటు అతని కార్యాలయంలో పనిచేస్తున్న 51 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. అయితే రిపోర్టులో అందరకీ కరోనా నెగిటివ్ అని తేలింది. అయినా ముందు జాగ్రత్తగా కొద్ది రోజులు క్యారంటైన్‌లో ఉండాలని కార్యక్రమాల్లో పాల్గొనరాదని ముఖ్యమంత్రికి ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com