29 Jun 2020 4:15 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / రక్షణ శాఖ సీనియర్...

రక్షణ శాఖ సీనియర్ కార్యదర్శి కరోనాతో మృతి

రక్షణ శాఖ సీనియర్ కార్యదర్శి కరోనాతో మృతి
X

ప్రస్తుత పరిస్థితుల్లో జలుబు, దగ్గు, జ్వరం వస్తే కరోనా వచ్చిందేమో అని అనుమానించాల్సి వస్తోంది. తేలికపాటి అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకున్న బంగ్లాదేశ్ రక్షణ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత నెల మే 29న అనారోగ్యంతో బాధపడుతూ ఢాకాలోని మిలిటరీ ఆస్పత్రిలో జాయినయ్యారు కార్యదర్శి అబ్దుల్లా అల్ మోసీన్ చౌదరి. దీంతో ఆయనను జూన్ 6న ఇంటెన్సివ్ కేర్ కు తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడం, దానికి తోడు గుండెపోటు కూడా రావడంతో ఆయన సోమవారం కన్ను మూశారు. అబ్ధుల్లా మృతికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలియజేశారు. రక్షణ శాఖ సిబ్బందితో పాటు పలువురు మంత్రులు, అధికారులు నివాళులర్పించారు. కాగా అబ్ధుల్లా కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Next Story