సర్కారుకే హైకోర్టు ఓటు.. సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్

సర్కారుకే హైకోర్టు ఓటు.. సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న సచివాలయాన్ని కూల్చి వేసి తెలంగాణ సర్కారు కొత్త భవనం నిర్మించాలని చూస్తోందంటూ దాదాపు పది పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. దాదాపు ఏడాదికి పైగా నడిచిన ఈ కేసుపై తుది తీర్పు విడుదల చేసింది హైకోర్టు. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది.

Tags

Read MoreRead Less
Next Story