త్రివిధ దళాల జవాన్లకు క్వారంటైన్ నిబంధనల సడలింపు

జవాన్లకు క్వారంటైన్ నిబంధనల సడలింపు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. త్రివిధ దళాల సిబ్బంది విషయంలో అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనలను సడలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు త్రివిధ దళాల సిబ్బంది సెలవుల నుంచిగానీ, తాత్కాలిక విధుల నుంచిగానీ తమ స్థావరాలకు తిరిగి వస్తే.. తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన ఉంది.
స్థావరానికి చేరుకోవడానికి 14 రోజులకు ముందు కరోనా పాజిటివ్ వ్యక్తితో కలవకుండా ఉంటే.. వారికి క్వారంటైన్ అవసరం లేదని ఉన్నత అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోతే కూడా క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పనిలేదని సూచించారు. విధి నిర్వహణ నిమిత్తం మధ్యలో ఎక్కడా ఆగకుండా మిలటరీ వాహనాల్లోగానీ, సొంత వాహనాల్లోగానీ ప్రయాణించినా క్వారంటైన్ అవసరం లేదని పేర్కొన్నారు. అయితే దేశ సరిహద్దుల్లో ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉండడంతో.. క్వారంటైన్ నిబంధనలో మార్పు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com