మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. హడలిపోతున్న సామాన్యులు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. హడలిపోతున్న సామాన్యులు
X

ఓ వైపు కరోనా.. మరోవైపు పెట్రో బాదుడుతో సామాన్యులు హడలిపోతున్నారు.. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 7 నుంచి 22 రోజులపాటు వరుసగా పెట్రో ధరల పెరిగాయి. అయితే దేశీయ చమురు కంపెనీలు ఆదివారం కాస్త విరామం ఇచ్చాయి. ఒక్క రోజు విరామం తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం పెట్రో, డీజిల్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మళ్లీ ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలను చమురు సంస్థలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కి చేరింది. ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం రూ.10.39, పెట్రోల్‌పై రూ.9.23 పైసలు పెరిగాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Tags

Next Story