తాప్సీ కి కరెంట్ బిల్ షాక్.. ఎంత వచ్చిందంటే?

తాప్సీ కి కరెంట్ బిల్ షాక్.. ఎంత వచ్చిందంటే?

దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ తరవాత.. కరెంట్ బిల్లులు తేరుకోలేని షాకిస్తున్నాయి. ఈ బిల్లులను చూసిన విద్యుత్ వినయోగదారులు బంబేలెత్తిపోతున్నారు. రెండు మూడు వేలు వచ్చే కరెంట్ బిల్లులు ఇపుడు ఏకంగా పది నుంచి 20 రెట్లు అదనంగా వస్తున్నాయి. సామన్యులు నుంచి సెలబ్రెటీలు వరకు కరెంట్ బిల్లులు చూసి షాక్ అవుతున్నారు.

ఇటీవల హీరోయిన్ కార్తీక ఇంటికి లక్షకు పైగా కరెంట్ బిల్ వచ్చింది. దీంతో ఆ భామ ట్విట్టర్ లో తన కరెంట్ బిల్ ను పోస్ట్ చేసి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు తాప్సికి సైతం కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. తాప్సీ ఇంటికి రూ.36,000 కరెంట్ బిల్ వచ్చింది. దాంతో ఆమె కూడా కార్తీక లాగా ట్విట్టర్ లో తన ఆవేదన వ్యక్తం చేసింది.

'ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు. వారంలో ఒక్కరోజు మాత్రమే క్లీనింగ్‌ కోసమని ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాం. మామూలు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికి తీసేందుకు నాకు సహాయం చేయండి' అంటూ అదాని ఎలక్ట్రిసిటీ ముంబై అధికారిక ఖాతాకు టాగ్ చేసింది. అంతేకాదు.. గత మూడు నెలల బిల్లులను కూడా ఆమె ట్వీట్ చేసింది. ఏప్రిల్‌లో రూ.4,390.. మేలో రూ.3,850.. జూన్‌లో రూ.36,000 వచ్చినట్లు ఆమె బిల్లులు ట్వీట్ చేసింది. సాధారణంగా వచ్చే బిల్లుతో పోలిస్తే 10రెట్లు ఎక్కువగా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి తాప్సి కంప్లైంట్ పై సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story