ఆన్ లైన్ గేమ్ చూసి.. అకౌంట్ లో రూ.10 లక్షలు కాజేసి..

ఆన్ లైన్ గేమ్ చూసి.. అకౌంట్ లో రూ.10 లక్షలు కాజేసి..
X

ఆన్ లైన్ గేమ్ లు ఆడుతూ టైమూ, డబ్బు వేస్ట్ చేస్తుంటారు పిల్లలు. కానీ ఉత్తర ప్రదేశ్ కు చెందిన 20 ఏళ్ల కుర్రాడు గేమ్ లో చెప్పినట్లుగా చేసి టీచర్ అకౌంట్లో ఉన్న రూ.10 లక్షలు కాజేశాడు. అంతర్జాతీయ ఆన్ లైన్ గేమ్ ట్రూత్ ఆర్ డేర్ లో భాగంగా ఇతరుల బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలు కాజేయాలని అతడికి చెప్పడం, దానికి కావలసిన హ్యాకింగ్ పాఠాలు అందులోనే నేర్చుకోవడం జరిగింది. దాంతో ఆ పాఠాలు నేర్చుకున్న సదరు యువకుడు ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ కు చెందిన బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశాడు. ఆమె ఖాతాలో నుంచి రూ. 10 లక్షలు కాజేశాడు. ఖాతాలో సొమ్ము పోయిన విషయాన్ని గుర్తించిన టీచర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Next Story