మహేష్.. యూ ఆర్ సో క్యూట్.. మీ కోసం ఈ చిరు కానుక: రష్మిక మందన

మహేష్.. యూ ఆర్ సో క్యూట్.. మీ కోసం ఈ చిరు కానుక: రష్మిక మందన

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబుతో జోడీ కట్టిన రష్మిక.. మహేష్ అందానికి ఫిదా అయింది.. ఆ చిత్రంలోని పాట కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది. యు ఆర్ సో క్యూట్.. యు ఆర్ సో హ్యాండ్సమ్ అంటూ రష్మిక మహేష్ బాబు అందాన్ని పొగిడేస్తుంటుంది. ఇక లాక్డౌన్ కారణంగా షూటింగ్ లు లేక అమ్మానాన్నలతో కూర్గ్ లోని హిల్ స్టేషన్ లోని తన ఇంట్లో ఉన్న రష్మిక అక్కడ పండే పండ్లను, తను స్వయంగా చేసిన ఆవకాయను అందంగా ప్యాక్ చేసి మహేష్ బాబుకి పంపించింది. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన ఇన్ స్టాలో తెలిపారు. రష్మిక పంపిన గిప్ట్ ను పోస్ట్ చేసిన నమ్రత.. లాక్డౌన్ లో మాకు అందిన ఫస్ట్ గిప్ట్ ఇది, కూర్గ్ లోని అద్భుతమైన వాతావరణం నుంచి మంచి ఐటెమ్స్ పంపిన రష్మికకు కృతజ్ఞతలు అంటూ నమ్రత పోస్ట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story