హాంకాంగ్ భద్రతా బిల్లుకు చైనా ప్రతినిధుల సభ ఆమోదం

హాంకాంగ్ భద్రతా చట్టానికి చైనా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇదొక వివాదాస్పద బిల్లు అని విమర్శలు వస్తున్నా.. హాంకాంగ్ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా.. చైనా ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్ లో ఏవైనా నిరసనలు జరిగితే.. ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షించే అవకాశం చైనాకు లభిస్తుంది. అయితే, ఈ చట్టంపై హాంకాంగ్ అంతటా నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. తమ స్వేచ్చను హరించే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టంతో తమ గుర్తింపు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హాంకాంగ్ 1997 వరకూ బ్రిటిష్ ఆధీనంలో ఉంది. తరువాత చైనా చేతుల్లోకి వెళ్లింది. అయితే, యాబై ఏళ్లు హాంకాంగ్ స్వతంత్రంగా ఉండేలా ఆనాడు ఒప్పందం జరిగింది. కానీ, ఇరవై ఏళ్ల అవ్వక ముందే హాంకాంగ్ ప్రజల స్వచ్చను హరించేలా చైనా చట్టం చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com