ఒక్కరోజే కరోనాతో 507 మంది మృతి

ఒక్కరోజే కరోనాతో 507 మంది మృతి
X

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి బుధవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 17,400కు చేరింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18,653 మందికి కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 5,85,493కి పెరిగింది. ఈ మొత్తం కేసుల్లో 3,94,958 కేసులు కేవలం ఒక్క నెలలో నమోదయ్యాయి. అంతేగాక 18,000లకుపైగా కేసులు నమోదవ్వడం వరుసగా ఐదో రోజు. ఈ కరోనా మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 3,47,978 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 59.43గా నమోదైంది. ప్రస్తుతం 2,20,114 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story