ప్రేమించలేదని మైనర్ బాలికపై వేడి నూనెతో దాడి

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కొందరు మగాల్లు మాత్రం మారటం లేదు. ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో మరి కొందరు మృగాళ్లు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్నారు. మైనర్ బాలిక తనను ప్రేమించడం లేదని ఆమెపై వేడి నూనెతో దాడి చేశాడు ఓ యువకుడు. పుదుచ్చేరిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.
కిరుమాంబాక్కం ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. అతని ప్రేమను ఆ బాలిక అంగీకరించలేదు. దీంతో బాలికపై కోపం పెంచుకున్నాడు యువకుడు. గత నెల 18వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై వేడి నూనె పోసి.. పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కిరుమాంబాకం పోలీసులు .. పరారీలో ఉన్న యువకుడిని అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com