నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలికి అస్వస్థత

X
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కాఠ్మండూలోని నేషనల్ హార్ట్ సెంటర్‌కు తరలించారు. కేపీ శర్మ వయస్సు 68 సంవత్సరాలు. ప్రస్తుతం శర్మ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.
ఇటీవల నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన మ్యాప్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు బుధవారం మంత్రివర్గ సమావేశానికి పిలుపునిచ్చిన కేపీ శర్మ ఓలి అనంతరం అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఏడాది మార్చిలో ఆయనకు రెండో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. 2007లో కేపీ శర్మ రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తొలుత ఒక కిడ్నీ మార్పిడి జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
