వామ్మో.. ఎంత ధైర్యం.. ఏకంగా పార్టీలే..

మాస్క్ మాటే లేదు.. సామాజిక దూరం సంగతే మర్చిపోయారు. ప్రపంచమంతా కరోనా గురించి మాట్లాడుకుంటుంటే వాళ్లు మాత్రం హ్యాపీగా విందారగిస్తున్నారు. నలుగురు కలిస్తే నలభై మందికి వస్తుందని భయపడి ఛస్తున్నాం ఇక్కడ. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో మాత్రం కరోనానా.. దాన్నెప్పుడో పంపించేశాం. అందుకే ఈ విందు అంటూ ఏకంగా వంతెనపైనే 500 మీటర్ల పొడవైన టేబుల్ ఏర్పాటు చేశారు. పైగా ఇదంతా ప్రభుత్వమే ఏర్పాటు చేసిందట. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని పోగొట్టడానికే ఇలా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఓండ్రేజ్ కోబ్జా అనే వ్యక్తి ఆధ్వర్యంలో వ్లతవ నదిపై ఈ విందు ఏర్పాట్లు జరిగాయి. జూన్ 30న కరోనా వైరస్ కు గుడ్ బై చెబుతూ పాటలు పాడుకుంటూ.. పార్టీ చేసుకున్నారు. అలాంటి రోజు మనదేశానికి ఎప్పుడొస్తుందో అని వీడియో చూసిన దేశాలు ఉడుక్కుంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com