బీహార్‌లో పిడుగుపడి 22మంది మృతి

బీహార్‌లో పిడుగుపడి 22మంది మృతి
X

బీహార్‌లో వరుసగా పిడుగులు పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాకు తోడు ఈ పిడుగుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం తాజాగా పిడుగుపడి 22 మంది మృతి చెందారని డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. గతవారం కూడా 92 మంది మృతి చెందారు. మృతి చెందిన కుటుంబాలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నాలుగు లక్షల ఆర్థిక సాయం అందించారు. తాజాగా నమోదైన పిడుగుపాటు మరణాలు పాట్నా, ఈస్ట్ చంపరాన్, సమస్టి‌పూర్, షివోహర్, కతిహార్, మాధేపుర, పూర్ణియాల్లో ప్రాంతాల్లో నమోదయ్యాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణా విభాగం ప్రకటించింది.

Tags

Next Story