మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన..162కి చేరుకున్న మృతుల సంఖ్య

మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన..162కి చేరుకున్న మృతుల సంఖ్య

మయన్మార్ లో ఓ గనివద్ద కొండ చరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 162 కు చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కచిన్ రాష్ట్రంలో హపకంట్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి గని ఉంది. దీనిని తవ్వి తీసిన మట్టి పక్కనపోస్తుంటారు. అయితే, ఈ గనిలో పనిచేస్తున్న కార్మికులు అక్కడే తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పక్కన పోసిన మట్టి.. కార్మికుల షెల్టర్లపై పడటంతో పలువురు చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది ఇప్పటికే మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ 162 మృతదేహాలు వెలికితీశారు. మట్టి దిబ్బల కింద మరికొంత మంది సజీవ సమాధి అయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 2015లో కూడా ఇలాంటి ఘటన ఇదే ప్రాంతంలో చోటు చేసుకుంది. అప్పటి సమాచారం ప్రకారం 113 మంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story