స్పానిష్ ఇన్ ప్లూయెంజాతో పోలిస్తే కరోనా ప్రభావం..

స్పానిష్ ఇన్ ప్లూయెంజాతో పోలిస్తే కరోనా ప్రభావం..
X

కొవిడ్ వ్యాక్సిన్ గురించి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాం కానీ, అది అందరికీ అవసరపడక పోవచ్చు. వైరస్ దానంతట అదే సమసి పోతుంది. కరోనాను సాధారణ ఫ్లూలాగే చూడాలి కానీ అనవసరంగా ఆందోళ చెందాల్సిన పనిలేదని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివర్శిటీకి చెందిన ఫ్రొఫెసర్ ఎపిడెమియాలజిస్ట్ సునేత్రా గుప్తా అభిప్రాయపడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, వృద్ధులపైనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మిగతా వారు త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు.

స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా కంటే కరోనా చాలా నయం. కరోనా మరణాల రేటు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది కదా.1918లో వచ్చిన ఇన్ ఫ్లూయెంజా కారణంగా 50 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతే 5 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. దీన్ని బట్టి ప్రస్తుతం మనం ఎంతో ఆందోళన చెందుతున్న కరోనా పెద్ద ప్రమాదకరమేమి కాదని అన్నారు. అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అయితే అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు అని గుప్తా వివరించారు.

Tags

Next Story