నేపాల్ ప్రధానికి ప్రస్తుతానికి తప్పిన పదవీగండం

నేపాల్ ప్రధానికి ప్రస్తుతానికి తప్పిన పదవీగండం

నేపాల్ ప్రధాని పదవి నుంచి రాజీనామా చేయాలని కేపీ ఓలీ శర్మకు ఎదురవుతున్న ఒత్తిడి నుంచి గొప్ప ఊరట లభించింది. భారత్ భూభాగాలను తమవిగా చూపిస్తూ.. కొత్త మ్యాప్ విడుదల చేసిన నేపాల్ ప్రధానికి.. గత కొన్ని రోజుల నుంచి సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. గురువారం కేపీ ఓలీ నేతృత్వంలో ఆయన నివాసంలో కేబినేట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో బడ్జెట్ సమావేశాలు నిలిపివేయాలని.. పార్లమెంట్ ను రద్దు చేయరాదని నిర్ణయించింది. దీంతో అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం తప్పింది. ఈ సమావేశం తరువాత ప్రధాని ఓలీ.. ప్రెసిడెంట్ బిద్యా దేవితో సమావేశమయ్యారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలు ప్రోరోగ్ చేయాలనే నిర్ణయానికి ప్రెసిడెంట్ ఆమోదం తెలిపారు. బుధవారం జరిగిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీలో ఓలీ రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఓలీకి వ్యతిరేక గళం వినిపించిన పార్టీ కో చైర్మన్ పుష్ఫ కమల్ దహల్ ప్రచండకు మొత్తం 44 మంది సభ్యుల్లో 31మంది మద్దతుగా నిలిచారు. దీంతో ఓలీ ప్రధాని పదవిని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతా భావించారు. కానీ, కేబినెట్ మీటింగ్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో తక్షణమే బలపరీక్ష ఎదుర్కొనే అవసరం లేకుండా పోయింది. ఫలితంగా ఓలీకి ప్రధాని పదవీ గండం ప్రస్తుతానికి తప్పింది.

Tags

Read MoreRead Less
Next Story