యజమాని మరణాన్ని తట్టుకోలేక శునకం ఆత్మహత్య..

యజమాని మరణాన్ని తట్టుకోలేక శునకం ఆత్మహత్య..
X

ప్రాణభిక్ష పెట్టి ప్రేమగా చూసుకున్న యజమాని మరణించడంతో నోరు లేని ఆ మూగ జీవి తల్లడిల్లింది. మేడ మీద నుంచి పడి తానూ మృతి చెందింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన డాక్టర్ అనితా రాజ్ సింగ్ కాన్పూర్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మాలిక్ పురంలో నివసిస్తున్న అనితా సింగ్ కు.. తాను పని చేస్తున్నఆస్సత్రి పక్కన గాయాలతో పడి ఉన్న కుక్క పిల్లను చూశారు. అనిత మనసు తల్లడిల్లిపోయింది. వెంటనే దాన్ని తీసుకుని ఇంటికి వెళ్లి సపర్యలు చేసి శునకం ప్రాణాలు నిలబెట్టారు. ఆ విశ్వాసం అలానే నిలిచి పోయిందే ఏమో శునకం మనసులో. ఆస్పతిలోనే మరణించిన అనితను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. జీవచ్ఛవంలా పడి ఉన్న యజమానిని చూసి శునకం మూగగా రోదించింది. మేడపైకి వెళ్లి కిందకు దూకింది. వెంటనే ప్రాణాలు కోల్పోయింది. అనిత మృతితో శునకం తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అనిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం.. శునకం కళేబరాన్ని ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టారు.

Tags

Next Story