త్వరలో పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తాం: కిషన్ రెడ్డి

త్వరలో పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తాం: కిషన్ రెడ్డి
X

త్వరలో పీవీ నర్సింహారావు ప్రత్యేక పోస్టల్ స్టాంప్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రసహాయక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పీవీ శతజయంతి పురస్కరించుకొని ఆయనకు ఈ విధంగా గౌరవించాలని కేంద్ర సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరానని ఆయన తెలిపారు. తన కోరికపై సానుకూలంగా స్పందించినందుకు ఆయన ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. పీవీ దూర దృష్టి, సంస్కరణలు దేశ గతిని మార్చేసిందని కిషన్ రెడ్డి అన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పీవీని కొనియాడారు. పీవీ సేవలు భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఆలోచనతోనే పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని నిర్ణయించామని అన్నారు.

Tags

Next Story