గాంధీ ఆస్పత్రి స్పెషల్ డైట్ చార్ట్.. రోగులకు, వైద్యులకు అదే భోజనం

గాంధీ ఆస్పత్రి స్పెషల్ డైట్ చార్ట్.. రోగులకు, వైద్యులకు అదే భోజనం

గాంధీ ఆస్పత్రి కరోనా రోగులకు సేవలందిస్తోంది. వైద్యులు, సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేస్తున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం అందిస్తున్నారు సిబ్బంది. ఈ పరిస్థితుల్లో అటు కరోనా రోగులకు, ఇటు వైద్యులకు, సిబ్బందికీ మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అవసరమని భావించింది ప్రభుత్వం. కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు వీలుగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం అందిస్తున్నారు. అదే ఆహారాన్ని వైద్యులు, సిబ్బంది సైతం తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక డిస్పోజబుల్ ప్లేట్లు వినియోగిస్తున్నారు. ఒక్కో రోగికి రోజుకు ఇరవై పదార్థాలు అవసరమైతే వాటన్నింటినీ డిస్పోజబుల్స్ లోనే అందిస్తున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల డైట్ షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది.

ఉదయం 7.30 - 8.00 గంటలకు అల్పాహారంగా ఇడ్లీ, పూరీ, బోండా, ఉప్మా, ఊతప్పలో ఏదో ఒకటి. దాంతో పాటు పాలు కూడా.

10 గంటలకు బిస్కెట్స్ తో పాటు టీ లేదా కాఫీ.

మధ్యాహ్నం ఒంటి గంటకు కూర, పప్పు, సాంబారు, పెరుగు, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్ తో భోజనం అందిస్తారు.. సాయింత్రం 4 గంటలకు కాఫీ, ఖర్జూరం, అంజీర్, జీడిపప్పు, బాదం పప్పులు, టీ ఇస్తారు..

రాత్రి 7.30 గంటలకు కూర, పప్పు, సాంబారు, పెరుగు, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్ తో భోజనం అందిస్తారు.

ప్రతి రోజు 55 మంది వైద్యులకు, 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు, వార్డ్ బాయ్స్ కు, 50 మంది వైద్య సిబ్బందికి ఇదే తరహాలో క్యాంటిన్ నుంచి భోజనం వెళుతుంది.

5వ అంతస్తులోని ప్రత్యేక గదుల్లో నర్సులకు, 6వ అంతస్తులోని ప్రత్యేక గదుల్లో వైద్యులకు భోజనం వడ్డిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story