బీహార్‌, యూపీలో పిడుగుపాటు.. 31 మంది మృతి

బీహార్‌, యూపీలో పిడుగుపాటు.. 31 మంది మృతి
X

బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో గురువారం పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు బీహార్‌లో 26 మంది మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో బీహార్‌లో మెరుపుల తాకిడికి వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతులకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో పిడుగులు పడి ఓ రిటైర్డ్‌ జవాన్‌ సహా ఐదుగురు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు.

Tags

Next Story