టీవీ సీరియల్ నటులని వదలని కరోనా.. మరో నటుడికి పాజిటివ్

టీవీ సీరియల్ నటులని వదలని కరోనా.. మరో నటుడికి పాజిటివ్

బుల్లితెర నటులను కరోనా వైరస్ పట్టుకుంది. సీరియల్ షూటింగ్ లు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా నటుడు రవికృష్ణకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని అందుకే మూడు రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, కరోనా లక్షణాలు ఏమీ లేవని తెలిపారు. తనతో షూటింగ్ లో పాల్గొన్న వారు, కలిసిన వారు ఎవరైనా సరే పరీక్షలు చేయించుకుని ఇంట్లోనే ఉంటే మంచిదని ఇన్ స్టాలో పేర్కొన్నారు.

మొగలి రేకులు సీరియల్ తో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన రవి కృష్ణ ఆ తరువాత వచ్చిన వరూధిని పరిణయం, శ్రీనివాస కళ్యాణం, మహాలక్ష్మీ బావా మరదళ్లు వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సీరియళ్లతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు. కాగా, ఇటీవల నవ్య స్వామి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రవికృష్ణ, నవ్య కలిసి ఆమెకథ సీరియల్ లో నటిస్తున్నారు. ఇద్దరికీ కరోనా రావడంతో సీరియల్ యూనిట్ ఆందోళన చెందుతోంది. రవికృష్ణ బిగ్ బాస్ 3 లో నటించి బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.

View this post on Instagram

A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) on

Tags

Read MoreRead Less
Next Story