కరోనా లక్షణాలున్నా రెండు సార్లు నెగిటివ్ అని రిపోర్ట్.. ఆఖరికి గుండెపోటుతో మృతి

కరోనా లక్షణాలున్నా రెండు సార్లు నెగిటివ్ అని రిపోర్ట్.. ఆఖరికి గుండెపోటుతో మృతి
X

వయసు 26 ఏళ్లు.. దంత వైద్యుడు.. కరోనా గురించి సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువే తెలిసిన వైద్యుడు.. వయసు కూడా చాలా తక్కువ.. అయినా రిపోర్ట్ నెగిటివ్ అని ఒకటి కాదు రెండు సార్లు అలానే వచ్చింది. నాకెందుకో ఇది కరోనాయే అని బలంగా అనిపిస్తోంది.. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది అంటూనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు డాక్టర్ అభిషేక్ భయానా.

ఈ లక్షణాలన్నీ కరోనాకు సంబంధించినవే.. 100% కరోనా పాజిటివ్ అయి ఉంటుంది అని డాక్టర్ అభిషేక్ భయానా తన అన్నయ్య అమన్ (31)కు గురువారం ఉదయం చెప్పారు. కానీ అభిషేక్ కి రెండు సార్లు టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చింది అని అమన్ కన్నీరు మున్నీరవుతున్నారు.

దిల్లీలోని మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెంట్ సైన్సెస్ (మియిడ్స్) లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ గా అభిషేక్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎయిమ్స్ ఎండిఎస్ పరీక్షల్లో 21వ ర్యాంకు సాధించారు. జూన్ 26న రోహ్తక్ లో జరిగిన కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. దంత వైద్యునిగా విధులు నిర్వహించిన అభిషేక్ వృత్తి పట్ల ఎంతో నిబద్ధదతో ఉండే వారని స్నేహితులు, కుటుంబసభ్యులు అతడి మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు.

కష్టపని చేసే వైద్యుడు, కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు సానుకూలంగా రాలేదు. గుండెపోటుతో మరణించాడు అని మెయిడ్స్ కు చెందిన సీనియర్ వైద్యుడు అన్నారు. సోదరుడితో గడిపిన చివరి రాత్రిని అమన్ గుర్తు చేసుకున్నారు. గురువారం ఉదయం వరకు బాగానే ఉన్నాడు. కానీ అంతలోనే నిస్సత్తువగా మారిపోయాడు. నీకు ఏమీ కాదని అభిషేక్ కి నేను ధైర్యం చెబుతూనే ఉన్నాను. కానీ అంతలోనే అతడి గుండె ఆగిపోయింది. ఈ నెల 22న అతడి 27వ పుట్టిన రోజు. అతడు మాతో లేడని మేము నమ్మలేకపోతున్నాము. మా తల్లిదండ్రులు షాక్ లో ఉన్నారు అని అమన్ ఆవేదన చెందుతున్నారు.

10 రోజుల నుంచి అభిషేక్ కరోనా వైరస్ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు తో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి తీసుకువెళితే వైద్యులు ఛాతి ఎక్సరే తీసి ఇన్ఫెక్షన్ ఉందన్నారు. మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. కానీ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో గురువారం అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనికి ఆక్సిజన్ ఇవ్వడం ప్రారంభించారు, కాని అప్పటికి చాలా ఆలస్యం అయింది ”అని అమన్ అన్నారు.

Tags

Next Story