చెవిలో బొద్దింక.. ఏకంగా గూడు కట్టేసుకుంది!

కొంత మంది అమ్మాయిలకు బొద్దింక కనబడితే చాలు.. అరచి గోల చేస్తారు. అలాంటిది ఓ అమ్మాయికి బొద్దింక కనబడటం కాదు.. ఏకంగా చెవిలో గూడు కట్టేసుకుంది. ఆమె చెవిలో ఎప్పుడు దూరిందో ఏమో.. చెవిలో శబ్దాలు రావడం, గిలిగింతలుగా అనిపించడం, అప్పడప్పుడు నొప్పిగా కూడా అనిపించేదట. దీంతో ఆమె ఇయర్ బడ్స్‌తో చెవిని క్లియర్ చేసుకోడానికి ప్రయత్నించింది. అయినా ఆమెకు ఉపశమనం లభించకపోగా నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో ఆమె డాక్టర్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఆమె చెవిలో బొద్దింక ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఆ బొద్దింక బతికే ఉందని తెలియడంతో డాక్టర్లు ఒకింత ఆశ్చర్యానికి గురైయ్యారు. చైనాలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది.
ఆమె చెవిలో బొద్దింక అటూ ఇటూ తిరుగుతుందని తెలియడంతో.. ఆందోళనకు గురైంది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. దీంతో డాక్టర్లు బాధితురాలికి ధైర్యం చెప్పి.. ఒటోస్కోప్ విధానంలో చెవిలోని బొద్దింకను బయటకు తీసేశారు. "సమయానికి ఆ బొద్దింకను బయటకు తీశాం కాబట్టి సరిపోయింది. లేకపోతే అది కర్ణభేరికి రంథ్రం చేసి తలలోకి ప్రవేశించేది" అని డాక్టర్లు తెలిపారు. నిద్రపోయే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఇంటిలో తరచుగా క్రిమివినాశకాలు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com