ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ క్యాస్టెక్స్

X
By - TV5 Telugu |4 July 2020 2:56 PM IST
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్ నియమితులైనారు. పీఎంగా జీన్ కాస్టెక్స్‌ను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ శుక్రవారం ప్రకటించారు. ఇప్పటివరకు ఫ్రాన్స్ పీఎంగా ఉన్న ఎడ్వర్డ్ ఫిలిప్స్ రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో కాస్టెక్స్‌ను నియమించారు. లాక్‌డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో మెక్రాన్ తన ప్రభుత్వాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు. కరోనానంతరం దశలవారీగా దేశాన్ని 'రీఓపెన్' చేయడంలో క్యాస్టెక్స్ కీలకంగా వ్యవహరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com