కరోనాతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి

కరోనాతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులతో పాటు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. సామాన్యలు నుంచి సెలబ్రిటీల వరకు కరోనాతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

64 ఏళ్ల పోకూరి రామారావుకు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో గత కొన్నిరోజులుగా హైద‌రాబాద్ కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విష‌మించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ త‌రం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోదరుడే పోకూరి రామారావు. ఈ త‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందిన పలు సినిమాలకు ఆయన స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. గోపిచంద్‌తో ' యజ్ణం', 'రణం' వంటి హిట్ సినిమాలను నిర్మించారు. పోకూరి రామారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story